Saturday, June 25, 2011




పల్లె-పడుచు

నిలువుటద్దము ఎదుట నిలబడి

తన సొగసు చూసుకు మురిసేను

పట్టుచీర కట్టిన ఓ కన్నె పడుచు

పచ్చటి పైరునే చీరగా చుట్టి

నడుమూపుతూ చిరుగాలికి

మురిసిపొతోంది చూదు నా పల్లె పడుచు

ఇంట అడుగిడిన ముత్తైదువులకు

పసుపుకుంకుమలిచ్చి ఆడపడుచులా

ఆదరించేను ఓ కన్నె పడుచు

తన గడపన అడుగిడిన అందరినీ

ఆదరించి కదుపునింపి కన్నతల్లిలా

ఆదరించు అన్నపూర్ణగా నా పల్లె పడుచు



కాళరాత్రి

ప్రియా!!!

నీవులేని ఈ నిశిరాత్రి

నడిరేయి దాటినా నీ దరినున్న

నిదుర నా దరి చేరదే
మిన్ను విరిగి మీద పడుతుందేమోనన్న భయం

నీవె లేని సమయంలో మన్నులో కలిసిపొతానేమోనన్న భయం

ఈ భయంకర ఊహలతో తెలవారే

ప్రతి రాత్రి నిజంగా అనిపిస్తుంది నాకొక కాలరాత్రి




తలరాత
గుండె చప్పుళ్ళు
ఆగని వెక్కిళ్ళు

భయపెడుతున్నాయి

చావుకేకలు

ఆకలి అరుపులు

ఆలోచింపచేస్తున్నాయి

వెకిలి నవ్వులు

విషపు చూపులు

తలదించుకునేలా చేస్తున్నాయి


కారుకూతలు

మోటార్ల మోతలు

చెవులు తూట్లు పొడుస్తున్నాయి

ఇలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ మరణ యాతన

ఎవరొచ్చి మార్చేను మన సమాజపు తలరాత