Saturday, June 25, 2011




పల్లె-పడుచు

నిలువుటద్దము ఎదుట నిలబడి

తన సొగసు చూసుకు మురిసేను

పట్టుచీర కట్టిన ఓ కన్నె పడుచు

పచ్చటి పైరునే చీరగా చుట్టి

నడుమూపుతూ చిరుగాలికి

మురిసిపొతోంది చూదు నా పల్లె పడుచు

ఇంట అడుగిడిన ముత్తైదువులకు

పసుపుకుంకుమలిచ్చి ఆడపడుచులా

ఆదరించేను ఓ కన్నె పడుచు

తన గడపన అడుగిడిన అందరినీ

ఆదరించి కదుపునింపి కన్నతల్లిలా

ఆదరించు అన్నపూర్ణగా నా పల్లె పడుచు



కాళరాత్రి

ప్రియా!!!

నీవులేని ఈ నిశిరాత్రి

నడిరేయి దాటినా నీ దరినున్న

నిదుర నా దరి చేరదే
మిన్ను విరిగి మీద పడుతుందేమోనన్న భయం

నీవె లేని సమయంలో మన్నులో కలిసిపొతానేమోనన్న భయం

ఈ భయంకర ఊహలతో తెలవారే

ప్రతి రాత్రి నిజంగా అనిపిస్తుంది నాకొక కాలరాత్రి




తలరాత
గుండె చప్పుళ్ళు
ఆగని వెక్కిళ్ళు

భయపెడుతున్నాయి

చావుకేకలు

ఆకలి అరుపులు

ఆలోచింపచేస్తున్నాయి

వెకిలి నవ్వులు

విషపు చూపులు

తలదించుకునేలా చేస్తున్నాయి


కారుకూతలు

మోటార్ల మోతలు

చెవులు తూట్లు పొడుస్తున్నాయి

ఇలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ మరణ యాతన

ఎవరొచ్చి మార్చేను మన సమాజపు తలరాత

Friday, September 24, 2010


దీర్ఘాయుష్మాన్ భవ

అరవిచ్చిన అందాల "ముద్దు గులాబీని"

సువాసనలు వెదజల్లు "చిరుమల్లెపువ్వుని"

అడ్డులేక పయనించు "చల్లని పిల్లతెమ్మెరని"

మేఘాలనుండి జాలువారు "చిరుచినుకుని "

ఉత్సాహంగా ముందుకురికే "చిరు వాగుని"

మరి సమాజంలో!

తల్లిగా,చెల్లిగా ఆలిగా, తనయగా అమ్మమ్మగా,నాన్నమ్మగా,

ఎందరో విజయాల వెనుక నేను ,

అద్భుతం,మహాద్భుతం,,,,,,,,,,,

స్త్రీ జన్మ మరో జీవికి జన్మ,,

ఆగ్రహించకండి,అంతమొందించకండి భావితరాలు

మానవజన్మన్న భయంతో తల దించుకునేలా

ఆదరించంది ఆశీర్వదించండి,,,,,,,,,,,,,,,,,,,,

తల్లీ నీకు "దీర్ఘయుష్మాన్ భవ" అని

Sunday, September 5, 2010






ప్రకృతి కాంత

సూర్యోదయవేళ!

తల నుండి జాలువారు మంచు మేలి ముసుగు తెరను తొలగించుకుంటూ
పచ్చ పచ్చని పట్టుచీరను గట్టి అప్పుడే విచ్చిన పూల పుప్పొడి సువాసనల
అత్తరుతో రాణివాసము నుండి నునుసిగ్గుతో అడుగు బయటిడెను . ఉదయ భానుని
క్రీగంటి చూపులను నుదుట సింధూరముగా దిద్దుకొనగ "ప్రకృతికాంత".

చంద్రోదయవేళ!

కాటుకకళ్ల కలువభామలు పగలంతా నిదురించి రాత్రి వేళ తమను తట్టి లేపే రేరాజు రాకకై
ఎదురుచూస్తుండగా సఖులరాకకై చీకటిని చీల్చుకుంటూ బిరబిరా వచ్చు శశిధరునికి దారి
చూపుటకై వెలుగుజిలుగుల తారలను సిద్ధం చేసి ఎదురు చూస్తున్నది "వెన్నెలకాంత".

Tuesday, June 29, 2010


ఆలోచన
"ఆలోచిస్తున్నాను" అంతులేని విజ్ఞానాన్ని

జనులందరికీ ఎలా పంచాలని

"ఆలోచిస్తున్నాను" సమాజంలో పేరుకుపోతున్న

నాగరికత అనే విశ్రుంఖలత్వాన్ని ఎలా తుంచాలని

"ఆలోచిస్తున్నాను" నేటి రాజకీయాలలో స్వార్థంతో

తల ఎత్తుకు యెదుగుతున్న నాయకులను ఎలా వంచాలని

"ఆలోచిస్తున్నాను" నా తల్లి భరతభూమి ఉన్నతిని
భారతీయులందరూ గర్వపడేలా ఎలా పెంచాలని

kinnerasaani


కిన్నెరసాని

వీణలా మీటితే
వినిపిస్తావు ఎన్నో "సరాగాలు"


కావాలని కసరి కొడితే
చూపుతావు కాటుక కల్లలొని " కోపాలు"

వద్దని వారిస్తే
చూదవచ్చును ముచ్చతైన "మూతివిరుపులు"

రా రమ్మని చేతులు చాచితే
చూపెవే భువిలొని "స్వర్గాలు"

ఇన్ని లయలు, హొయలు ఎక్కడివే నీలో
ఓ నా కిన్నెరసాని
.........