Saturday, June 30, 2012

                         








                                  కావాలనుకున్నాను
 కావాలనుకున్నాను "ఉలిని"
      వికృతరూపాలతో నున్న ఈ ప్రపంచాన్ని అందంగా మలచాలని
కావాలనుకున్నాను "కలిమిని"
      మనుషులందరిలో సమభావం పెంచడానికి
కావాలనుకున్నాను జనులందరి "గళాన్ని"
      అన్యాయాలను అడ్డుకోండని ఎలుగెత్తి అరవడానికి
కావాలనుకున్నాను "చెలిమిని"
      సమాజంలో సహోదరత్వాన్ని పెంచడానికి
కావాలనుకున్నాను "మంచిని "
      ప్రతి మనిషిలో పుట్టుకతో విస్తరించాలని
మరి
ఎన్ని కావాలనుకున్నా ఏమీ కాలేకపోతున్నాను
ఎందుకని?
నన్ను జన్మించనివ్వకుండా ప్రతి మనిషి
చంపుతున్నారు మరి
నేనెలా జన్మనెత్తను?

Wednesday, June 27, 2012

                                               











                                                       ఎలా తెలుపను???
 


         ఉలికిపడ్డ చిన్నారిని ఊరడించాను
                    ఉరుములూ, మెరుపులూ తననేమీ చేయవని
                     వానలా కురిసి వెలిసిపోతాయని
       ఉలికిపడ్డచిన్నారిని ఊరడించాను
                తనకు కనిపించిన భూతరాకాసి ,తననేమీ చేయదని
                 కలలో మాత్రమే తనకు బలమని
                ఇలనది తనకంటే బలహీనురాలని
      ఉలికిపడ్డ చిన్నారిని ఊరడించాను
                    ఉరికి కిందపడి, గాయపడి
                  అమ్మ తంతుందన్న భయం వద్దని
                     కాలి గాయం చిన్నదేనని, మందులతో మానుతుందని
      ఉలికిపడ్డ చిన్నారిని చూసి
                       వణికిపొయాను ఊరడించలేక
                      ఇంటిలోన, బడిలోన, గుడిలోన తననెందుకు అందరూ
                      వేధిస్తున్నారు, చంపేస్తున్నారని ఏడుస్తూ ఇంటికొచ్చిన
                      చిట్టి తల్లికి ఏమని చెప్పను, ఎలా చెప్పను
                        తనకు వచ్చిన కష్టాలు    
                        వానలా వెలసిపోయేవి కావని
                        తనకంటే బలహీనమైనవి కావని  
                      మందులతో మాసిపోవని ఎలా!!!ఎలా
    ఎలా తెలుపను నా చిట్టి తల్లికి
                    కష్టాలను చూచి కంట నీరు కాదు
                   నిప్పులు కురిపించమని
                    వేధించువారిని వెంటబడి  తరిమికొట్టమని
                     చంపువారి చావుకు ముహూర్తం పెట్టమని
                    చెప్పాలి ఈనాటి భయంకర పరిస్థితులను
               చెప్పాలి నా తల్లికి అలనాడు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన
 
                                     గీతోపదేశంలా!!!!