Saturday, September 29, 2012

                     


 

 

దృశ్యమాలిక

చూడకూడదనుకుంటూనే చూశాను
పక్కింటి పెరట్లోకి
చూపు తిప్పుకోలేకపోయాను చూసిన దృశ్యాన్ని చూసి
పక్కింటి అతను ఆమె కురులు దువ్వి, పూలు ముడిచి,
మురిసిపోతున్నాడు అపురూపంగా
 నాకక్కడ కనిపించింది అశ్లీలత కాదు వారిలోని
అనురాగం, అభిమానం
చూడటం సంస్కారం కాదని తెలిసినా చూసాను
నా ఎదురుగా వస్తున్న పడుచు జంటను తదేకంగా
బిడ్డనెత్తుకొని నడుస్తున్న భర్తను,వ్యానిటీ బ్యాగును
భుజానికి తగిలించుకొని వయ్యారంగా నడుస్తున్న భార్యను
నేను చూస్తున్నది భార్యా విధేయతను కాదు
తొమ్మిదినెలలు నా బిడ్డను నీ కడుపున మోసావు,
ఇకనుండి మన బిడ్డ బరువును నేను మోస్తాను అన్న బాధ్యతను
ఆరాధనగా చూస్తున్నను వారి అన్యోన్యతను
నాకెందుకనుకుంటూనే చూసాను చిన్నిచిన్ని అడుగులు వేస్తూ
భుజాన పుస్తకాల బరువుతో బడికి వెళ్తున్న అన్నాచెల్లెలును
ఇంటిలోన అమ్మానాన్నలు మనకు పెద్ద కానీ
ఇంటిబయట నీవు అడుగుపెట్టేవేళ నేనే నీకు పెద్ద అంటూ
చిన్ని అన్న చిట్టి చెల్లెలి వేలు పట్టుకుని అటూఇటూ చూస్తూ
రోడ్డు దాటించడాన్ని చూస్తున్నను వారు
నా కనుమరుగయ్యేదాకా కంటినిండుగా
చూడకూడదనుకుంటూనే చూశాను
వినకూడదనుకుంటూనే విన్నాను
నడివయసులోని ఓ స్త్రీమూర్తిని తన రెండు చేతులతో
పసిబిడ్డలా ఎత్తుకొచ్చి పరచివుంచిన మంచంపై
పడుకోబెట్టి ముంగురులు సవరిస్తున్న ఓ యువకుడిని
అమ్మా!! తొమ్మిదినెలలు నను మోసినా
నేనేడిస్తే నువ్వేడిచి, నేను నవ్వితే నువ్వు నవ్వి,,
నన్నొక మనిషిగా తీర్చిదిద్దడంలో అలసిన నీవు ఇక నా సేవలో
విశ్రాంతి తీసుకోవమ్మ
ఇకనుండి నేనే నీకు తల్లిని, తండ్రిని కొదుకుని అంతో
ఆర్ధ్రతతో కంతడిపెట్టిన కన్నతల్లి
కన్నీరు తుడుస్తున్న కొడుక్కొడుకు మాటలు విన్నాను చెవికింపుగా,,,
చూస్తున్నాను ఆ దృశ్యాన్ని అపురూపంగా   
    







                                    మౌనం


    అందంగా వున్నావని
    ఆ అందం తన సొంతం కాలేదని
    యాసిడ్ పోసి ఆనందించే
    ఓ "కామాంధుడిని" చూసి,
    ఆలివయ్యాక ఒకరికి, వెలయాలి కోసం ఇల్లాలివని చూడకుండా
    అంతమొందింప చూసిన "భర్త" అనే
   "నయవంచకుడిని" చూసి
    అమ్మవయ్యాక నలుగురికి, అమ్మకాదు మాకు
   కావలసింది ఆమె ఆస్తి మాత్రమేనంటూ నిన్ను
   వృద్ధాశ్రమంలో చేర్చిన "కొరగాని కొడుకులని" చూసి
   ఓ మగువా ! ఎందుకీ మౌనం ?????
   స్త్రీ అంటేనే సహనం అనిపించుకోవాలనా లేక
  ఆడది అబలే కాని సబల కాదనే నిరూపణ కోసమా
  లలనా ! ఎందుకీ మౌనం??????
  నీ మౌనం కారాదు మరో స్త్రీ కి 
  అమానుష ఆచారం      

Saturday, June 30, 2012

                         








                                  కావాలనుకున్నాను
 కావాలనుకున్నాను "ఉలిని"
      వికృతరూపాలతో నున్న ఈ ప్రపంచాన్ని అందంగా మలచాలని
కావాలనుకున్నాను "కలిమిని"
      మనుషులందరిలో సమభావం పెంచడానికి
కావాలనుకున్నాను జనులందరి "గళాన్ని"
      అన్యాయాలను అడ్డుకోండని ఎలుగెత్తి అరవడానికి
కావాలనుకున్నాను "చెలిమిని"
      సమాజంలో సహోదరత్వాన్ని పెంచడానికి
కావాలనుకున్నాను "మంచిని "
      ప్రతి మనిషిలో పుట్టుకతో విస్తరించాలని
మరి
ఎన్ని కావాలనుకున్నా ఏమీ కాలేకపోతున్నాను
ఎందుకని?
నన్ను జన్మించనివ్వకుండా ప్రతి మనిషి
చంపుతున్నారు మరి
నేనెలా జన్మనెత్తను?

Wednesday, June 27, 2012

                                               











                                                       ఎలా తెలుపను???
 


         ఉలికిపడ్డ చిన్నారిని ఊరడించాను
                    ఉరుములూ, మెరుపులూ తననేమీ చేయవని
                     వానలా కురిసి వెలిసిపోతాయని
       ఉలికిపడ్డచిన్నారిని ఊరడించాను
                తనకు కనిపించిన భూతరాకాసి ,తననేమీ చేయదని
                 కలలో మాత్రమే తనకు బలమని
                ఇలనది తనకంటే బలహీనురాలని
      ఉలికిపడ్డ చిన్నారిని ఊరడించాను
                    ఉరికి కిందపడి, గాయపడి
                  అమ్మ తంతుందన్న భయం వద్దని
                     కాలి గాయం చిన్నదేనని, మందులతో మానుతుందని
      ఉలికిపడ్డ చిన్నారిని చూసి
                       వణికిపొయాను ఊరడించలేక
                      ఇంటిలోన, బడిలోన, గుడిలోన తననెందుకు అందరూ
                      వేధిస్తున్నారు, చంపేస్తున్నారని ఏడుస్తూ ఇంటికొచ్చిన
                      చిట్టి తల్లికి ఏమని చెప్పను, ఎలా చెప్పను
                        తనకు వచ్చిన కష్టాలు    
                        వానలా వెలసిపోయేవి కావని
                        తనకంటే బలహీనమైనవి కావని  
                      మందులతో మాసిపోవని ఎలా!!!ఎలా
    ఎలా తెలుపను నా చిట్టి తల్లికి
                    కష్టాలను చూచి కంట నీరు కాదు
                   నిప్పులు కురిపించమని
                    వేధించువారిని వెంటబడి  తరిమికొట్టమని
                     చంపువారి చావుకు ముహూర్తం పెట్టమని
                    చెప్పాలి ఈనాటి భయంకర పరిస్థితులను
               చెప్పాలి నా తల్లికి అలనాడు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన
 
                                     గీతోపదేశంలా!!!!