Sunday, May 5, 2013

                             

     

                 

                         పసిపాప అంతరంగం

ఉయ్యాల్లో పసిపాప ఉలికిపడ్డావెందుకమ్మా???
అమ్మ చెంతనుంది కదా ఆదమరచి నిదురపో
భయమంత వీడి నువ్వు బోసినవ్వువు నవ్వుకో
అమ్మ లాలి పాటలో మునిగి నువ్వు నిదురపో
ఉలికిపడ్డ పసిపాప అంతరంగమందిలా
అమ్మ చెంత నాకెపుడూ భయంలేదు, బాధలేదు
అమ్మనోటి లాలిపాట అమృతమే నా పాలిట కానీ
నాలాగే జన్మనెత్తి అమ్మ ఒడిలో ఆడి
పెరిగి మగాడు మృగాడయ్యి
మేకవన్నె పులిలా సమాజంలో చరిస్తుంటే
ఉలికిపడ్డాను ఆడజన్మను తలచుకుని
అమ్మ చెంతనున్నా, అమ్మ ఒడిననున్నా
ఆదమరచి నేనసలు నిదురనే పోలేను
 ఎందుకో తెలుసా?????
పాపం అమ్మకుడా ఆడదే కదా!!!!!!!!!!!!
అందుకే ఉలికిపడుతున్నాను మగమృగాళ్ళనుండి
అమ్మ నన్ను రక్షిస్తుందా???????????
తనని తాను రక్షించుకుంటుందా???అని

                                         మదమెక్కిన మగమృగాళ్ళ పంజాలకు బలి అయ్యి వాడిపోయిన పసిమనసులకు ఈ నా కవిత అంకితం 


Tuesday, April 16, 2013


 

 

 

 

 

నీడ

ధర్మేచ,అర్థేచ,కామేచ,మోక్షేచ,నాతిచరామి
అన్న నీ నోటి మంత్రాలు నా చెవులలో
నేటికీ ప్రతిధ్వనిస్తుంటే,
వాటి అర్థం తెలియని వాడిలా
ఎలా వెళ్ళగలిగావు నీవు???నను వీడి
నేను నీ దరికి చేరలేననా?
వేదమంత్రాల అర్థం తెలిసి నీవు నన్ను వదిలితే
ఆ అర్థాల సాక్షిగా నేను నిన్ను వదలను
ఇదిగో నీకొసం నీ సాహచర్యం కోసం వస్తున్నాను
నీ జాడ తెలిపే మృత్యువుతో కలిసి
నీ నీడను స్వాగతించవా ప్రియా????