Friday, September 24, 2010


దీర్ఘాయుష్మాన్ భవ

అరవిచ్చిన అందాల "ముద్దు గులాబీని"

సువాసనలు వెదజల్లు "చిరుమల్లెపువ్వుని"

అడ్డులేక పయనించు "చల్లని పిల్లతెమ్మెరని"

మేఘాలనుండి జాలువారు "చిరుచినుకుని "

ఉత్సాహంగా ముందుకురికే "చిరు వాగుని"

మరి సమాజంలో!

తల్లిగా,చెల్లిగా ఆలిగా, తనయగా అమ్మమ్మగా,నాన్నమ్మగా,

ఎందరో విజయాల వెనుక నేను ,

అద్భుతం,మహాద్భుతం,,,,,,,,,,,

స్త్రీ జన్మ మరో జీవికి జన్మ,,

ఆగ్రహించకండి,అంతమొందించకండి భావితరాలు

మానవజన్మన్న భయంతో తల దించుకునేలా

ఆదరించంది ఆశీర్వదించండి,,,,,,,,,,,,,,,,,,,,

తల్లీ నీకు "దీర్ఘయుష్మాన్ భవ" అని

Sunday, September 5, 2010






ప్రకృతి కాంత

సూర్యోదయవేళ!

తల నుండి జాలువారు మంచు మేలి ముసుగు తెరను తొలగించుకుంటూ
పచ్చ పచ్చని పట్టుచీరను గట్టి అప్పుడే విచ్చిన పూల పుప్పొడి సువాసనల
అత్తరుతో రాణివాసము నుండి నునుసిగ్గుతో అడుగు బయటిడెను . ఉదయ భానుని
క్రీగంటి చూపులను నుదుట సింధూరముగా దిద్దుకొనగ "ప్రకృతికాంత".

చంద్రోదయవేళ!

కాటుకకళ్ల కలువభామలు పగలంతా నిదురించి రాత్రి వేళ తమను తట్టి లేపే రేరాజు రాకకై
ఎదురుచూస్తుండగా సఖులరాకకై చీకటిని చీల్చుకుంటూ బిరబిరా వచ్చు శశిధరునికి దారి
చూపుటకై వెలుగుజిలుగుల తారలను సిద్ధం చేసి ఎదురు చూస్తున్నది "వెన్నెలకాంత".