Sunday, September 5, 2010






ప్రకృతి కాంత

సూర్యోదయవేళ!

తల నుండి జాలువారు మంచు మేలి ముసుగు తెరను తొలగించుకుంటూ
పచ్చ పచ్చని పట్టుచీరను గట్టి అప్పుడే విచ్చిన పూల పుప్పొడి సువాసనల
అత్తరుతో రాణివాసము నుండి నునుసిగ్గుతో అడుగు బయటిడెను . ఉదయ భానుని
క్రీగంటి చూపులను నుదుట సింధూరముగా దిద్దుకొనగ "ప్రకృతికాంత".

చంద్రోదయవేళ!

కాటుకకళ్ల కలువభామలు పగలంతా నిదురించి రాత్రి వేళ తమను తట్టి లేపే రేరాజు రాకకై
ఎదురుచూస్తుండగా సఖులరాకకై చీకటిని చీల్చుకుంటూ బిరబిరా వచ్చు శశిధరునికి దారి
చూపుటకై వెలుగుజిలుగుల తారలను సిద్ధం చేసి ఎదురు చూస్తున్నది "వెన్నెలకాంత".

1 comment:

  1. jameela గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

    హారం

    ReplyDelete