పసిపాప అంతరంగం
ఉయ్యాల్లో పసిపాప ఉలికిపడ్డావెందుకమ్మా???అమ్మ చెంతనుంది కదా ఆదమరచి నిదురపో
భయమంత వీడి నువ్వు బోసినవ్వువు నవ్వుకో
అమ్మ లాలి పాటలో మునిగి నువ్వు నిదురపో
ఉలికిపడ్డ పసిపాప అంతరంగమందిలా
అమ్మ చెంత నాకెపుడూ భయంలేదు, బాధలేదు
అమ్మనోటి లాలిపాట అమృతమే నా పాలిట కానీ
నాలాగే జన్మనెత్తి అమ్మ ఒడిలో ఆడి
పెరిగి మగాడు మృగాడయ్యి
మేకవన్నె పులిలా సమాజంలో చరిస్తుంటే
ఉలికిపడ్డాను ఆడజన్మను తలచుకుని
అమ్మ చెంతనున్నా, అమ్మ ఒడిననున్నా
ఆదమరచి నేనసలు నిదురనే పోలేను
ఎందుకో తెలుసా?????
పాపం అమ్మకుడా ఆడదే కదా!!!!!!!!!!!!
అందుకే ఉలికిపడుతున్నాను మగమృగాళ్ళనుండి
అమ్మ నన్ను రక్షిస్తుందా???????????
తనని తాను రక్షించుకుంటుందా???అని
No comments:
Post a Comment