రాయంచ
ప్రేమ జంటల నడుమ
రాయబారము నడిపి
నలదమయంతుల కథాసృష్తికే
కారనంబయ్యెనదివో "రాయంచ"
కాటుక దిద్దిన కన్నులతో
ముచ్చటగొలుపు ముంగురులు
మోమున కదలాడగా "కన్నె"
కదలుచున్నది చూడు కాలి
అందియలు ఘల్లుఘల్లుమన
కవుల కల్పనలోన అప్పడతి నడకలే
తన నడకలై నిలిచెనదిగో "రాయంచ"
తన్నుగొలిచి విద్యనర్థించువారల
తలపులెల్ల ఙ్ఞానామృతముతో నింపి నారాయణ
మంత్రమ్ము నలవోకగా పలుకునట్లుగా
నరులనాలుక పైన నడయాడు
చదువులమ్మ తల్లి వాహనమ్ముగా
నిలిచె మరువకుండనెవరు నదివో "రాయంచ"
No comments:
Post a Comment