Monday, June 25, 2012

                                                            


                                                       మృత్యువు
 

మాఇంటికొచ్చింది ఒకనాడు పిలవకున్నా
మా నాన్నతో కలిసి
ఎందుకొచ్చావని తిట్టాను, ఏడ్చాను, చేతులు జోడించాను 
మరెప్పుడూ రావద్దని
నవ్వుకుంటూ, నాకేసి అదోలా చూస్తూ నాన్నను తీసుకెళ్ళింది
చెవిటిదానికిమల్లే
మా ఎదురింటికొచ్చింది, ఆ ఇంటి యజమానిని వెంట తీసుకెళ్ళింది
అతని భార్యనొంటరిని చేసి
మళ్ళీ అదే నవ్వు, అదే చూపు బంధాలతో సంభందాలు లేకుండా
అమ్మఒడి నుండి చదువులమ్మనవుదామని
బడికెళ్ళే చిన్నారి వెనువెనకే వచ్చి చటుక్కున
తన కబంద హస్తాలతో ఒడిసిపట్టి తీసుకెళ్ళింది 
అదే నవ్వు, అదే చూపు జాలి లేకుండా  
భయమేస్తుంది ఇపుడు తను మళ్ళీ ఎప్పుడొస్తుందో
ఎవరింటి తలుపు తట్టి, తలుపు తెరచిన వారిని తనతో తీసుకెళ్ళుతుందోనని, కానీ
నాకు అర్థం కానిది ఒక్కటే ఎంతమందినైనా
ఎవరినైనా వెంటతీసుకెళ్ళే తనని (మృత్యువు )
తీసుకెళ్ళేవారెవరూ లేరా ??????రారా?????అని

2 comments:

  1. chakkani feel tho raasaarandi, manchi kavitha.

    ReplyDelete
    Replies
    1. thanks a lot for your valuable comment hope i get the same support

      Delete