నేనెవరిని
ఆకలి తీర్చువేళ అన్నపూర్ణవంటారు
సేవలు చేయువేళ అమ్మలాంటిదానివంటారు
సలహాలనిచ్చువేళ స్నేహితురాలివంటారు
రాత్రివేళ పడకలోన రంభవంటారు
కానీ
ఇంటికి ఆలస్యంగా వచ్చినవేళ , రానివేళ
ఎక్కడికెళ్ళారని అడిగితే
నా ఇష్టం అంటారు , మరి
మీకొసం ఎదురుచూసే నేనెవరిని అంటే
జీతం లేని పనిమనిషివంటారు
మరి నిజంగా నేనెవరిని ?????
No comments:
Post a Comment